ఆర్ ఆర్ ఆర్ లో కీ పాయింట్ ను రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

ఆర్ ఆర్ ఆర్ లో కీ పాయింట్ ను రివీల్ చేసిన రాజమౌళి తండ్రి
ఆర్ ఆర్ ఆర్ లో కీ పాయింట్ ను రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ రచయిత అన్న విషయం తెల్సిందే. రాజమౌళి డైరెక్ట్ చేసిన చాలా సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించాడు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి కూడా కథ అందించింది ఈయనే. రీసెంట్ గా విజయేంద్ర ప్రసాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆర్ ఆర్ ఆర్ లో యాక్షన్ బ్లాక్స్ చూస్తుంటే తన కళ్ళ నుండి నీళ్లు వచ్చాయని తెలిపాడు.

ఇటీవలే మరో ఇంటర్వ్యూలో అలా ఎందుకు అన్నారో అని వివరణ అడిగారు. “మనకు ఇష్టమైన ఇద్దరు కొట్టుకుంటే మనకు బాధ కలుగుతుంది కదా. అక్కడ యాక్షన్ సన్నివేశాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు కానీ ఇద్దరూ మనకు నచ్చిన వారే. వాళ్ళు కొట్టుకుంటుంటే మనకు అదో రకమైన ఫీలింగ్ ఉంటుంది” అని విజయేంద్ర ప్రసాద్ అన్నాడు.

అంటే దీనర్ధం రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మధ్య యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లే కదా. మరి వీరిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో.