ఆర్ ఆర్ ఆర్ యాక్షన్ పార్ట్… కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి: విజయేంద్ర ప్రసాద్

ఆర్ ఆర్ ఆర్ యాక్షన్ పార్ట్... కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి: విజయేంద్ర ప్రసాద్
ఆర్ ఆర్ ఆర్ యాక్షన్ పార్ట్… కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి: విజయేంద్ర ప్రసాద్

రాజమౌళి సినిమాలకు కథకుడిగా పనిచేస్తాడు విజయేంద్ర ప్రసాద్. ఆయన కథ, రాజమౌళి టేకింగ్ ఇప్పటి దాకా ఈ రెండూ ఏనాడూ గురి తప్పలేదు. బాహుబలి తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆర్ ఆర్ ఆర్ పై మాత్రం ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఆర్ ఆర్ ఆర్ గురించి ప్రస్తావన వస్తే టీమ్ మాత్రం యాక్షన్ సన్నివేశాల గురించి మాట్లాడుతూ వస్తోంది. ఆర్ ఆర్ ఆర్ యాక్షన్ సన్నివేశాలు వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెబుతున్నారు. అయితే విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ లో యాక్షన్ సన్నివేశాలను చూసినప్పుడు తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయని చెప్పుకొచ్చాడు.

రేపు థియేటర్లో ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు కూడా ఇదే అనుభూతికి లోనవుతారని ఆయన నమ్మకంగా చెబుతున్నాడు.