సీనియ‌ర్ హీరోకు క‌రోనా పాజిటివ్‌!


సీనియ‌ర్ హీరోకు క‌రోనా పాజిటివ్‌!
సీనియ‌ర్ హీరోకు క‌రోనా పాజిటివ్‌!

కెప్టెన్ ప్ర‌భాక‌ర్‌, పోలీస్ అధికారి చిత్రాల‌తో తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న యాక్ష‌న్ హీరో, పొలిటిక‌ల్ లీడ‌ర్‌ విజ‌య్ కాంత్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఇటీవ‌ల చేసిన ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఆయ‌న ప‌రిస్థితి నిల‌క‌డ‌గా వుంద‌ని డాక్ల‌ర్లు వెల్ల‌డించారు. హీరో విజ‌య్ కాంత్‌కు ఈ నెల 22న క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన‌ట్టు తెలిసింది.

ఆయ‌న‌కు చెన్నైలోని ఎంఐఓటీ హాస్పిట‌ల్‌లో చికిత్స అందిస్తున్నామ‌ని, ప్రస్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా వుంద‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న కోలుకుని డిశ్చార్జ్ అవుతార‌ని ఎంఐఓటీ హాస్పిట‌ల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ పృథ్వీ మోహ‌న్ దాస్ వెల్ల‌డించారు. గ‌త కొంత కాలంగా గ‌త ఆరు నెల‌ల‌కు ఒక‌సారి విజ‌య్ కాంత్ సంపూర్ణ ఆరోగ్యం కోసం వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటుంటారు.

ఈ నేప‌థ్యంలో ఎప్ప‌టి లాగే ప‌రీక్ష‌ల కోసం హాస్పిట‌ల్‌కు వెల్లిన విజ‌య్ కాంత్‌కు స్వ‌ల్పంగా క‌రోనా ల‌క్ష‌ణాలున్న‌ట్టు బ‌య‌ట‌ప‌డింద‌ట‌. దీంతో క‌రోనా టెస్ట్ చేయ‌గా ఆయ‌న‌కు పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు ఆయ‌న స‌న్నిహితులు వెల్ల‌డించారు.