విషయమున్న దర్శకుడు మళ్ళీ అదరగొట్టబోతున్నాడు!

విషయమున్న దర్శకుడు మళ్ళీ అదరగొట్టబోతున్నాడు!
విషయమున్న దర్శకుడు మళ్ళీ అదరగొట్టబోతున్నాడు!

లోకేష్ కనగరాజ్.. చేసినవి రెండు సినిమాలే అయినా తనకంటూ ఒక స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు. రెండు చిత్రాలూ దేనికవే భిన్నంగా తెరకెక్కాయి. 2017లో వచ్చిన మా నగరం, 2019లో రీసెంట్ గా వచ్చిన ఖైదీ చిత్రాలు విభిన్నంగా ఉంటూనే ప్రేక్షకులను మెప్పించాయి. ఈ రెండు సినిమాల్లో దర్శకుడి టాలెంట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా కార్తీ నటించిన ఖైదీ చిత్రంతో లోకేష్ పేరు అటు తమిళంలోనే కాక తెలుగులో కూడా మార్మోగిపోయింది. దీపావళికి విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో లోకేష్ ఏకంగా ఇళయదళపతి విజయ్ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. కేవలం రెండే సినిమాలతో విజయ్ ను డైరెక్ట్ చేస్తున్నాడంటే లోకేష్ చాలా టాలెంటెడ్ అనే చెప్పుకోవచ్చు.

న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. మాస్టర్ అనే టైటిల్ తో ఉన్న ఈ పోస్టర్ బ్లర్ ఎఫెక్ట్ తో అదిరిపోయిందని చెప్పవచ్చు. దీంతో లోకేష్ మరో భిన్నమైన సినిమాతో మన ముందుకు వస్తున్న ఫీల్ అయితే కలిగించాడు. షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి విజయ్ ఈ మధ్య అన్నీ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలే చేస్తూ వస్తున్నాడు. సినిమాలు సక్సెస్ అవుతున్నాయి కానీ మరీ కమర్షియల్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోయి భిన్నమైన అటెంప్ట్స్ చేయట్లేదన్న అపవాదు వస్తోంది. విజయ్ సినిమాలు ఎక్కువగా కమర్షియల్ ఫార్మాట్ లోనే వెళ్తుంటాయి.

అందుకే ఈసారి విజయ్ భిన్నంగా ప్రయత్నించాలని లోకేష్ తో జతకట్టాడు. ఈ సినిమా ద్వారా కచ్చితంగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించవచ్చని భావిస్తున్నాడు. మొత్తంగా మాస్టర్ సినిమాపై ఫస్ట్ లుక్ తో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. పైగా ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడు. విజయ్ కు ఈ మధ్య తెలుగులో మార్కెట్ పెరిగింది. విజిల్ కూడా 10 కోట్ల మేర షేర్ రాబట్టింది. దర్శకుడి పేరు కూడా ఇప్పుడు తెలుగు వాళ్లకు సుపరిచితమైంది. అనిరుధ్ కూడా జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలతో తెలుగు వారికీ చేరువయ్యాడు. ఈ నేపథ్యంలో మాస్టర్ సినిమాకు తెలుగులో బిజినెస్ మార్కెట్ బాగుంటుందని అంచనాలు ఉన్నాయి.