మార్కెట్ పెంచుకున్న విజయ్


Vijay's Sarkar gets benifits from tollywood

టాలీవుడ్ లో మార్కెట్ పెంచుకున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్ . తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ , అక్కడ తిరుగులేని స్టార్ డం అందుకున్నాడు అయితే టాలీవుడ్ లో మాత్రం సరైన మార్కెట్ లేదు ఈ హీరోకు . గత ఇరవై ఏళ్లుగా విజయ్ నటించిన తమిళ చిత్రాలు తెలుగులో డబ్ అవుతున్నాయి కానీ పెద్దగా హిట్ కావడం లేదు . ఒకవేళ ఓ మోస్తరుగా హిట్ అయినా మార్కెట్ అంతగా పెరగడం లేదు . తుపాకి చిత్రంతో కాస్త దారిలో పడ్డాడు అనిపించినప్పటికీ పాపం కుదరలేదు . ఆమధ్య మెర్సల్ అదిరింది గా రిలీజ్ అయ్యింది మంచి వసూళ్ల ని సాధించింది . దాంతో సర్కార్ చిత్రానికి టాలీవుడ్ లో కాస్త డిమాండ్ ఏర్పడింది దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని 7 కోట్లకు కొన్నారు .

అయితే ఈ సినిమాకు వచ్చిన షేర్ ఎంతో తెలుసా …… 8. 45 లక్షలు అంటే అన్ని ఖర్చులు పోను కోటిన్నర లాభం అన్నమాట ! సర్కార్ చిత్రం చుట్టూ పలు వివాదాలు చెలరేగడం కూడా ఈ వసూళ్లు రావడానికి కారణం అయ్యింది . యావరేజ్ చిత్రంగా సర్కార్ చిత్రానికి టాక్ వచ్చింది అయినప్పటికీ కోటిన్నర లాభం అంటే ముందుముందు విజయ్ కి ఇక్కడ మరింతగా మార్కెట్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది .

English Title: Vijay’s Sarkar gets benifits from tollywood