విజయ్ సర్కార్ టాక్ ఎలా ఉందో తెలుసా


Vijay's SARKAR premiere show talk

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు భారీ ఎత్తున విడుదల అయ్యింది . ఇక ఓవర్ సీస్ లో ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడ్డాయి . ఆ ప్రీమియర్ షోల ప్రకారం టాక్ ఎలా ఉందో తెలుసా …….. ఫస్టాఫ్ యావరేజ్ కాగా సెకండాఫ్ మాస్ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాడట దర్శకులు మురుగదాస్ దాంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం కష్టమని , కాకపోతే విజయ్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సర్కార్ విపరీతంగా నచ్చడం ఖాయమని అంటున్నారు ఈ సినిమాని చూసిన వాళ్ళు . ఎందుకంటే ఇది వన్ మ్యాన్ షోగా సాగిందని , విజయ్ ఫ్యాన్స్ కు మాత్రం భలేగా నచ్చుతుందని అంటున్నారు . పాటలు సినిమాలో స్పీడ్ బ్రేకర్ లా వచ్చాయట ! అలాగే విజయ్ స్టైల్ ముందు మిగిలిన నటీనటులు అంతా తేలిపోయారని టాక్ .

ఇక మురుగదాస్ ని కూడా పలువురు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు అలాగే విమర్శలు కూడా చేస్తున్నారు . ఇక కొంతమంది అయితే సర్కార్ సినిమా కంటే స్పైడర్ సినిమా చాలా బెటర్ అని అంటున్నారు . అయితే ఈ మాటలు అంటున్నది సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నది మాత్రం యాంటి ఫ్యాన్స్ అనే విషయం తెలిసిపోతోంది . మొత్తానికి విజయ్ స్టైల్ , యాక్టింగ్ తో ఈ సినిమా పైసా వసూల్ అయ్యేలా ఉందని టాక్ . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సర్కార్ ఫలితం ఎలా ఉండబోతోందో కొద్ది గంటల్లోనే తెలియనుంది .

English Title: Vijay’s SARKAR premiere show talk