200 కోట్ల దిశగా సర్కార్


Vijay's sarkar towards 200 crore club

ఇళయ దళపతి విజయ్ కి వివాదాస్పద అంశాలు బాగా కలిసి వస్తున్నాయి దాంతో యావరేజ్ చిత్రం అనుకున్న సర్కార్ కు భారీ వసూళ్లు వస్తున్నాయి . కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 186 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించాడు సర్కార్ . తమిళనాట విజయ్ స్టార్ హీరో అన్న విషయం తెలిసిందే . దాంతో అక్కడ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి . అయితే భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ సినిమాకు యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది . టాక్ బాగోలేదు కాబట్టి సర్కార్ పని అయిపోయిందని అనుకున్నారు కానీ సర్కార్ చిత్రం చుట్టూ పలు వివాదాలు చుట్టుముట్టడంతో వసూళ్ళ వర్షం కురుస్తోంది .

సర్కార్ చిత్రం ఇంతగా వివాదం కావడానికి కారణం ఏంటో అన్న ఆసక్తితో సినిమాని చూసేవాళ్ళు ఎక్కువయ్యారు దాంతో మంచి వసూళ్లు వస్తున్నాయి . ఆరు రోజుల్లోనే 186 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే అర్ధం చేసుకోవచ్చు విజయ్ మేనియా అలాగే సర్కార్ వివాదాల వల్ల కలిగే లాభాలు . మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది . సర్కార్ సినిమా 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది . ఈ జోరు ఇలాగే కొనసాగితే 200 కోట్లకు మించి వసూల్ చేయడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

English Title: Vijay’s sarkar towards 200 crore club