విజయనిర్మల అంత్యక్రియలు పూర్తి

Vijaya Nirmala
Vijaya Nirmala

సీనియర్ నటి , దర్శకురాలు విజయనిర్మల అంత్యక్రియలు పూర్తయ్యాయి . అంత్యక్రియలను విజయనిర్మల కొడుకు నటుడు నరేష్ నిర్వహించారు . చిలుకూరు సమీపంలోని విజయనిర్మల ఫామ్ హౌజ్ లో తన అంత్యక్రియలను నిర్వహించారు . నానక్ రామ్ గూడ ఇంటినుండి చిలుకూరు సమీపంలోని ఫామ్ హౌజ్ వరకు అశేష అభిమానులతో ర్యాలీగా వెళ్లారు .

విజయనిర్మల పార్దీవదేహంతో నరేష్ తో పాటు మరికొంతమంది వెళ్లగా వెనకాల కారులో కృష్ణ తో పాటుగా మహేష్ బాబు తదితరులు వెళ్లారు . ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనిర్మల పార్దీవ దేహాన్ని సందర్చించి కృష్ణ కు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసాడు . విజయనిర్మల అంతిమయాత్ర కు పెద్ద ఎత్తున కృష్ణ అభిమానులతో పాటుగా మహేష్ బాబు అభిమానులు కూడా పాల్గొన్నారు .