వెబ్ సిరీస్‌గా గ్యాంగ్ స్ట‌ర్ జీవితం!vikas dubey life story made in to web series
vikas dubey life story made in to web series

బ‌యోపిక్‌ల ప‌రంప‌ర న‌డుస్తోంది. ఏ భాష‌లో చూసిన జీవిత క‌థ‌ల ఆధారంగా సినిమాలు తెర‌పై కొస్తున్నాయి.చాలా వ‌ర‌కు సూప‌ర్ హిట్‌లుగా నిలిచాయి. ఇదే కోవ‌లో కొంత మంది క్రిమిన‌ల్స్ జీవిత క‌థ‌లు కూడా వెబ్ సిరీస్‌ల రూపంలో తెర‌పైకొస్తున్నాయి. తాజాగా జ‌రిగిన ఎన్ కౌంట‌ర్‌లో హ‌త‌మైన గ్యాంగ్ స్ట‌ర్ వికాస్ దూబే జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తెర‌పైకి రాబోతోంది.

గ్యాంగ్ స్ట‌ర్‌గా ఎంతో మంది జీవితాల్ని నాశ‌నం చేసి, కొంత మంది పోలీసుల్ని కూడా హ‌త్య చేసిన వికాస్ దూబే జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ రాబోతోంది. క్రేజీ ఫిల్మ్ మేక‌ర్ హ‌న్స‌ల్ మెహ‌తా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన అనుమతుల్ని ఇప్ప‌టికే పొందిన‌ట్టు చెబుతున్నారు. ప్రొడ్యూస‌ర్ శైలేష్ సింగ్ నిర్మించ‌నున్నార‌ట‌.

ఇందులో ఎవ‌రు న‌టిస్తారు? .. ఎప్ప‌టి నుంచి మొద‌ల‌వుతుంది? .. వంటి వివ‌రాల్ని మేక‌ర్స్ త్వ‌ర‌లో అధికారికంగా వెల్ల‌డించ‌నున్నార‌ట‌. వికాస్ దూబే నేర సామ్రాజ్యం వెన‌కున్న ర‌హ‌స్యాలేంటీ? .. వికాస్ దూబే ఎందుకు గ్యాంగ్‌స్ట‌ర్ అయ్యారు? అన్న విష‌యాల్ని ఈ వెబ్ సిరీస్‌లో చ‌ర్చించ‌నున్నార‌ట‌.