ఆదిత్య వర్మ.. విక్రమ్ ఫుల్ హ్యాపీస్


ఆదిత్య వర్మ.. విక్రమ్ ఫుల్ హ్యాపీస్
ఆదిత్య వర్మ.. విక్రమ్ ఫుల్ హ్యాపీస్

సినిమా ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే వాళ్ళు ఎంత కష్టపడ్డా, తమ పిల్లలు సినిమాల్లోకి వస్తానంటే ఆ కష్టం ఉండకూడదనే భావిస్తారు. వాళ్ళకి పెర్ఫెక్ట్ లాంచ్ ఇవ్వాలని కలలు కంటారు. విలక్షణ నటుడు విక్రమ్ కూడా అలాగే భావించాడు. తన కొడుకు ధృవ్ విక్రమ్ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు తనకి అంతా పెర్ఫెక్ట్ ఉండాలని అర్జున్ రెడ్డి రీమేక్ ను సజెస్ట్ చేసాడు. ఈ సినిమా అయితే ఆల్రెడీ ప్రొవెన్ సబ్జెక్ట్, పైగా నటనకు మంచి పేరు వచ్చే అవకాశముంది. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా విజయ్ దేవరకొండకు ఎంత పేరు వచ్చిందో మనందరం చూసాం. అందుకే అర్జున్ రెడ్డి రీమేక్ చేస్తే ధృవ్ విక్రమ్ కు హీరోగా మంచి పేరు వస్తుందని తలచాడు విక్రమ్. అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అంటారు. ధృవ్ విక్రమ్ విషయంలో అదే జరిగిందా అనిపిస్తుంది. ఇంటెన్సిటీ ఉన్న సినిమాలను పెర్ఫెక్ట్ గా తీస్తాడు అన్న పేరున్న బాల అర్జున్ రెడ్డి రీమేక్ కు దర్శకుడిగా ఎంచుకున్నా సినిమా అంతా చూసాక, అది బాలేదని దాన్ని మొత్తం తీసి చెత్తబుట్టలో పడేయాల్సిన పరిస్థితి.

కొడుకు విషయంలో బాల వంటి దిగ్గజ దర్శకుడని కూడా చూడలేదు విక్రమ్. ఆ తర్వాత మళ్ళీ కాస్ట్ అండ్ క్రూ లో మార్పులు చేసి ఆదిత్య వర్మను తెరకెక్కించారు. గత వారమే విడుదలైన ఈ సినిమాకు మొదట మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే మెల్లగా ఈ సినిమాను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఒరిజినల్ తో పోలిక పెట్టలేం కానీ ధృవ్ విక్రమ్ కూడా ఆకట్టుకున్నాడనే పేరు వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగా పెరిగాయి. మొదటి వీకెండ్ ముగిసేసరికి దాదాపు 8 కోట్ల గ్రాస్ వచ్చింది. మొదటి వారంలో 11 కోట్ల గ్రాస్ అందుకుని ఆదిత్య వర్మ హిట్ స్టేటస్ సంపాదించుకుంది. సెకండ్ వీకెండ్ లో కూడా ఆదిత్య వర్మకు రెస్పాన్స్ బాగుంది. ఈ విషయంలో విక్రమ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.

కొడుకు మొదటి సినిమా హిట్ అవ్వడంతో కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఆదిత్య వర్మకు వస్తోన్న రెస్పాన్స్ పట్ల ఆనందంగా ఉన్నాడు. ఒక రివ్యూలో విక్రమ్ కొడుకు ధృవ్ అని కాకుండా ధృవ్ తండ్రి విక్రమ్ అని రాసారని, ఒక తండ్రిగా తనకు ఇంతకంటే ఏం కావాలంటూ ఎమోషనల్ గా వ్యాఖ్యానించాడు. అలాగే తన కొడుకు మొదటి సినిమాకు ఇంత మంచి సినిమా రావడానికి మూల కారకుడైన సందీప్ వంగకు కృతఙ్ఞతలు చెప్పాడు. సందీప్ దగ్గర అర్జున్ రెడ్డికి పనిచేసిన గిరీశాయ ఆదిత్య వర్మను తెరకెక్కించడం విశేషం. ఏదేమైనా ఆదిత్య వర్మ హిట్ అవ్వడం పట్ల విక్రమ్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇప్పుడు ధృవ్ రెండో సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ధృవ్, విక్రమ్ కలిసి నటిస్తారని అంటున్నారు. మరి చూడాలి అందులో నిజమెంతుందో.