షూటింగ్ మొదలైన కమల్ హాసన్ విక్రమ్

షూటింగ్ మొదలైన కమల్ హాసన్ విక్రమ్
షూటింగ్ మొదలైన కమల్ హాసన్ విక్రమ్

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తన రాజకీయ అరంగేట్రం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం రాజకీయంగా కమల్ చేసేది లేకపోవడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టాడు. కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ 2 లీగల్ ఇబ్బందుల్లో పడింది. ఇప్పట్లో ఆ సినిమా షూటింగ్ మొదలవ్వడం కష్టమే. అందుకోసమే కమల్ తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టాడు.

ఖైదీ, మాస్టర్ చిత్రాలతో గుర్తింపు సంపాదించుకుని టాప్ డైరెక్టర్ అనిపించుకున్న లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్ హీరోగా విక్రమ్ ను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఈరోజే మొదలైంది. మొత్తం ఐదు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

విక్రమ్ లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంత మంది పేరున్న నటులు కలిసి నటిస్తుండడంతో విక్రమ్ కు చాలా బజ్ వచ్చింది. 2022లో విక్రమ్ విడుదల కానుంది.