మార్చి 15న ప్రేక్షకుల ముందుకు “వినరా సోదరా వీర కుమారా” చిత్రం


Vinara Sodara Veera Kumara Movie get release date

లక్ష్మణ్ సినీ విజన్స్ బ్యానర్ లో శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం “వినరా సోదరా వీరకుమార“. లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం  వహిస్తున్న ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ నేపథ్యంలో మొదటగా  నిర్మాత లక్ష్మణ్ క్యాదారి మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

 

ఎంతో కష్టపడి ఒక మంచి పాయింట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయనున్నాము. వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ పైనే కష్టపడ్డారు దర్శకుడు సతీష్. అందరినీ మెప్పించాలని చేసిన ఈ మా  ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం అని అన్నారు. దర్శకుడు సతీష్ మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చిన నిర్మాత లక్ష్మణ్ కు నేను జన్మాతం రుణపడి ఉంటాను. ఒక కొత్త పాయింట్ తో సినిమా ను తెరకెకించడం జరిగింది. సినిమా చూసిన వారందరూ ఎంతో మెచ్చుకున్నారు.. ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్, డిజిటల్ రైట్స్ మ్యాంగో రాము గారు తీసుకున్నారు.

 

అందుకు ఆయనకు స్పెషల్ థాంక్స్. అందరి సపోర్ట్ తో ఈ 15న సినిమాను విడుదల చేయనున్నాము.. అందరికీ తప్పకుండా నచ్చి తీరుతుందని ఆశిస్తున్నా అని తెలిపారు. హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ నెల 15న అఫీషియల్ గా  ప్రేక్షకుల ముందుకు   వెళ్లనుందని తెలియ చేస్తున్న  ఈ రోజు మాకు ముఖ్యమైన రోజు గా భావిస్తున్నాను.  ఈ  సినిమా ట్రైలర్ ను నిర్మాత దిల్ రాజు గారు విడుదల చేసారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్త పాయింట్ తో కొత్త వారితో చేసిన సినిమా అందరి ఆదరణ పొందుతుందని నమ్మకం గా ఉన్నాను. ఇదివరకు నేను చేసిన సినిమాల కంటే బెటర్ పేరు,  సినిమా అవుతుందని భావిస్తున్నా అన్నారు. హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ… కొత్త అమ్మాయినైనా మంచి సినిమాకు ఎంపిక చేసిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.. ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ లాగా తీర్చిదిద్దారు కెమెరా మెన్ రవి గారు. చాలా కష్టపడి ఒక మంచి సినిమాను అందించాము..  ఇప్పటి వరకు ఇది మా సినిమా 15 నుంచి మీ సినిమా కనుక ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.

 

శ్రీ‌నివాస్‌సాయి, ప్రియాక‌జైన్‌, ఉత్తేజ్‌, ఝాన్సీ, జెమిని సురేష్‌, ర‌విరాజ్‌, ప‌వ‌న్‌ర‌మేష్‌, స‌న్ని, రోష‌న్‌, జైబోలో చంటి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ఃల‌క్ష్మీభూపాల‌, సంగీతంః శ్ర‌వ‌ణ్‌భ‌ర‌ద్వాజ్‌, కెమెరాఃర‌వి.వి, డాన్స్ఃఅజ‌య్‌సాయి, స్టంట్స్ఃరాబిన్‌సుబ్బు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ఃఅనిల్ మైలాపుర్ ప్రొడ్యూస‌ర్ఃల‌క్ష్మ‌ణ్‌క్యాదారి, డైరెక్ట‌ర్ఃస‌తీష్ చంద్ర‌ నాదెళ్ళ‌.

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Jr. Ntr wants only NTR brand not telugu desam partyTamannah wants lip lock with Hrithik roshan


Priyanka jawalkar skin showHeroine oviya love with simbuWife in BJP husband and son in ysrcpNoorin shereef fall in love with Allu arjun