యువతకు సందేశాన్నిచ్చే “వినరా సోదరా వీరకుమారా ” రివ్యూ


vinara sodara veera kumara movie review

లక్ష్మణ్ సినీ విజన్స్ బ్యానర్ పై  శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ జంటగా నటించిన చిత్రం “వినరా సోదరా వీరకుమార”. లక్ష్మణ్ క్యాదారి నిర్మించిన ఈ చిత్రానికి సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహించాడు.   ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం యూత్ ను ఎలా మెప్పిస్తుందో చూద్దాం .

కథ:

ఆటో డ్రైవర్ అయిన రమణ(శ్రీనివాస్ సాయి),  ఇంజినీరింగ్ చదివే సులోచన(ప్రియాంక జైన్)ను ప్రేమిస్తాడు. అయితే సులోచన మాత్రం రమణ  ప్రేమను ఒప్పుకోదు. కానీ రమణ మాత్రం ఆమె ప్రేమను దక్కించుకోవడానికి సులోచన బావ చేతిలో  దెబ్బలు కూడా తింటాడు.  చివరకు సులోచన కూడా రమణ ని ప్రేమిస్తుంది. అయితే పెళ్లికి మాత్రం ఒప్పుకోదు.  బావను పెళ్లి చేసుకుంటానంటుంది. దాంతో  రమణ ఏం చేసాడో  తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

కథ.. కథనం విశ్లేషణ: ఇప్పటి వరకు అనేక ప్రేమకథలను వెండితెర మీద చూసుంటాం. అవన్నీ ప్రేమ, రొమాన్స్ ప్రధాన పాయింట్ మీదనే తెరమీద అలరించాయి. ఇందులో వీటితో పాటు… ప్రేమికులకు, తల్లిదండ్రులకు ఓ మెసేజ్ ఇవ్వడానికి ఎంచుకున్న కొత్తపాయింట్… దాన్ని ముందుకు నడిపించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే కొత్తగా వుంది. ఈ పాయింట్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ కొత్త పాయింట్ కి తోడుగా… శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ ల మధ్య తెరకెక్కిన క్యూట్ లవ్ స్టోరీ బాగుంది. అలాగే వీరిద్దరి మధ్య తెరకెక్కిన రొమాంటిక్ లవ్ సీన్స్ ను కూడా దర్శకుడు యూత్ ను అలరించేలా తెరకెక్కించారు. చివరలో ప్రేమికులకు ఇచ్చిన సందేశం బాగుంది. తప్పకుండా ఆలోచించే పాయింట్ ఇది. తల్లిదండ్రులతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. ఎక్కడా వల్గారిటీకి తావులేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమా ఇది.

శ్రినివాస్ సాయి చాలా ఎనర్జిటిక్ గా నటించారు. తన మాస్ లుక్ తో యూత్ ను ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా పాటల్లోనూ… యాక్షన్ సీన్స్ లోనూ తన ఈజ్ నెస్ తో ఆకట్టుకుంటాడు. అలానే తనకు జంటగా నటించిన ప్రియాంక జైన్ హోమ్లీ లుక్ తో.. చాలా క్యూట్ గా వుంది. ఎక్కడ తడబాటు లేకుండా తన ఎక్స్ ప్రెషన్స్ ను ప్రెజెంట్ చేసింది. రొమాంటిక్ సీన్స్ లో యూత్ కు కనువిందు చేస్తుంది. హీరో హీరోయిన్లు పెయిరే ఇందులో ప్రధాన ఆకర్షణ. హీరో తండ్రిగా నటించిన ఉత్తేజ్, తల్లిగా నటించిన ఝాన్సీ తమ పాత్రలకు న్యాయం చేశారు. గ్రామీణ వాతావరణానికి సంబంధించిన వ్యక్తులుగా చాలా చక్కగా నటించారు. హీరో ప్రెండ్ గా నటించిన బాల నటుడు కూడా చక్కగా నటించాడు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన జెమిని సురేష్, రవిరాజ్, పవన్ రమేష్, సన్ని, రోషన్, జైబోలో చంటి తదితరులంతా తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు సతీష్ చంద్ర నాదెళ్ల రాసుకున్న ప్రేమకథ.. దానికి తోడు  ఓ కొత్తపాయింట్.. దానిని నడిపించడానికి  ఎంచుకున్న స్క్రీన్ ప్లే… ఇంట్రెస్టింగ్ గా వుంది. యూత్ కి మంచి సందేశం ఇవ్వాలని ఎంచుకున్న పాయింట్ అందరినీ అలరిస్తుంది. దీనికి తోడు ల‌క్ష్మీభూపాల రాసిన సంభాషణలు హృదయాన్ని హత్తుకునేలా వున్నాయి. ఈ చిత్రానికి సంగీతం కూడా ప్లస్ అయింది. రొమాంటిక్ సాంగ్స్ బాగున్నాయి. ఉప్పాడ బీచ్ అందాలతో పాటు గ్రామీణ వాతావరణాన్ని వెండితెరమీద ఎంతో రిచ్ గా చూపించారు సినిమాటోగ్రాఫర్. అలానే పాటల పిక్చరైజేష్ బాగుంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్, పాటలు బాగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత లక్ష్మణ్ ఎక్కడా రాజీ పడలేదు. సో.. యువత తప్పక చూడాల్సిన సినిమా.

రేటింగ్: 3