అనిల్ రావిపూడి లాంఛ్ చేసిన “వినరా సోదరా వీరకుమారా” సాంగ్


Vinara Sodhara Veera kumara movie song launched by Anil Ravipudi

లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకం పై శ్రీనివాస సాయి ,ప్రియాంక జైన్ హీరోహీరోయిన్లుగా సతీష్ చంద్ర నాదెళ్ల  దర్శకత్వంలో ,లక్ష్మణ్ క్యాదారి నిర్మించిన చిత్రం ‘ వినరా సోదర   వీరకుమారా‘ .ఈ చిత్రం  ఫస్ట్ సాంగ్ ని  ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి  ఇటీవల హైదరాబాద్ లో  లాంచ్ చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్ కూడా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ” వినరా సోదర వీరకుమారా   ట్రైలర్ చూసాను. చాలా ఇంట్రెస్టింగ్  గా ఉంది. సాంగ్స్ కూడా చాల బాగున్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తూ, టీమ్ మొత్తానికి నా విషెస్ తెలియజేస్తున్నాను.’ అన్నారు.

ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ  ‘ఈ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ నేను కలసి మేం వయసు కి వచ్చాము మూవీ చేసాం. ఈ చిత్ర టీం కొత్త ప్రయత్నం చేశారు.మూవీ చాలా బాగుంది. దర్శకుడు అనిల్ తో సాంగ్ లాంచ్ చేయడం శుభ పరిణామం ‘ అని అన్నారు.

చిత్ర నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ”  మా సినిమా మొదటి పాటను  అనిల్ రావిపూడి గారు రిలీజ్ చేయడం  సంతోషం గా ఉంది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను ‘ అన్నారు.

ఇంకా ఈ  కార్యక్రమంలో  హీరో శ్రీనివాస సాయి ,  చిత్ర దర్శకుడు  సతీష్ చంద్ర నాదెళ్ల ,  అనిల్ మైలాపురం , కిరణ్ .సి.హెచ్. తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస సాయి , ప్రియంకజైన్, జాన్సీ, ఉత్తేజ్, జెమిని సురేష్  తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా : రవి.వి  ,సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ , మాటలు: లక్ష్మీ భూపాల , ఎడిటర్ :మార్తాండ్ .కె.. వెంకటేష్. నిర్మాత: లక్ష్మణ్ క్యాదారీ,  దర్శకత్వం: సతీష్ చంద్ర నాదెళ్ల.

English Title: Vinara Sodhara Veera kumara movie song launched by Anil Ravipudi