అగ్ర నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ – “క్రేజీ కాంబినేషన్ మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అనగానే … అనౌన్స్మెంట్ రోజు నుండే భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి `వినయ విధేయ రామ` అనే టైటిల్‌ను ఖరారు చేశాం. దీపావళి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాం. ఈ ఫస్ట్‌లుక్ ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ దీపావళికి మరో కానుకగా అందిస్తున్నాం. ఈ నవంబర్ 9న టీజర్‌ను విడుదల చేయబోతున్నాం. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. రెండు పాటలు మినహా నవంబర్ 10 నాటికి షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుకగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నాం“ అన్నారు.