వినయ విధేయ రామ ట్విట్టర్ రివ్యూ

Vinaya Vidheya Rama twitter Reviewరాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం ఈరోజు భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే . కాగా ఈ సినిమాకు మెగా అభిమానులు బ్రహారథం పడుతున్నారు . ఇప్పటికే పలు చోట్ల షోలు పడిపోయాయి దాంతో టాక్ వస్తోంది . ఇక సినిమా చూస్తున్న వాళ్ళు ట్విట్టర్ లో రివ్యూ పెడుతున్నారు . ట్విట్టర్ రివ్యూ మిక్స్ డ్ గా ఉంది . కొంతమంది బాగుంది అంటే ఎక్కువ మంది చెత్తగా ఉంది అంటున్నారు .

అయితే బోయపాటి శ్రీను స్టైల్ లో మాస్ ని అలరించే అంశాలు మాత్రమే ఉన్నాయట ! దాంతో ఈ వినయ విధేయ రామ చిత్రం కేవలం బిసి కేంద్రాలు అలాగే మెగా అభిమానులకు మాత్రమే అని చెప్పొచ్చు . రాంచరణ్ సరసన కైరా అద్వానీ నటించగా కీలక పాత్రల్లో తమిళ హీరో ప్రశాంత్ , స్నేహ , ఆర్యన్ రాజేష్ లు నటించారు . ఇక విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ నటించాడు . మెగా ఫ్యాన్స్ ని మాత్రం ఈ సినిమా సంతోషపరచడం ఖాయం అయితే మిగతా ప్రేక్షకులకు నచ్చితేనే హిట్ అవుతుంది లేదంటే షరా మాములే !

English Title: Vinaya Vidheya Rama twitter Review