హీరోగా లాంఛ్ అవడానికి కసరత్తులు చేస్తున్న వినాయక్!!


VV Vinayak
VV Vinayak

“ఆది”తో డైరెక్టర్ గా పరిచయమై చెన్న కేశవరెడ్డి, ఠాగూర్, బన్నీ, కృష్ణ, దిల్, అదుర్స్ వంటి సూపర్ హిట్స్ చిత్రాలు తెరకెక్కించిన వి.వి.వినాయక్ దర్శకుడిగా తనకంటూ ఒక సెపరేట్ స్టయిల్ని ఏర్పరుచుకున్నారు. దర్శకుడిగా వినాయక్ ది సెపరేట్ స్టైల్ అనే చెప్పాలి. రీసెంట్ గా ఆయన సాయిధరమ్ తేజ్ తో “ఇంటిలిజెంట్” చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం ఆశించినంత విజయం కాక పోవడంతో వినాయక్ కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఆయన మూడు భారీ ప్రాజెక్టులు సిద్ధం చేసుకున్నారు. ఇదిలా ఉండగా మరో పక్క వినాయక్ హీరోగా నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. ‘శరభ’ వంటి విజువల్ వండర్ ని రూపొందించిన నరసింహా రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా కోసం వినాయక్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కసరత్తులు చేస్తున్నారు..అతి త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది!!