హలో డాక్టర్ అబ్బాస్ మిస్సాయే…


హలో డాక్టర్ అబ్బాస్ మిస్సాయే...
హలో డాక్టర్ అబ్బాస్ మిస్సాయే…

‘ప్రేమ దేశం’ సినిమా మీకు గుర్తుందా? 1996 లో వచ్చిన తమిళ-తెలుగు డబ్బింగ్ సినిమా ఇది. అబ్బాస్-వినీత్-టబు కలిసి నటించిన యువతరం సినిమా.కదిర్ దర్శకత్వం వహించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించారు. ‘హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే’, ‘ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా’ పాటలు మనం 2019 లో వినడానికి కారణం సినిమా అంతలా అందరిని ప్రభావితం చేసింది.

అయితే ఆ తర్వాత వినీత్, టబు, అబ్బాస్ అందరూ ఒక్కసారిగా అందరికి ఫేవరెట్ అయిపోయారు. టబు అడపాదడపా తెలుగు సినిమాలు చేసినా… వినీత్, అబ్బాస్ మాత్రం తెలుగులో చాలా సినిమాలు చేసారు. ఒక్కసారిగా స్టార్ హీరోలు కూడా అయిపోయారు. అయితే అబ్బాస్ మాత్రం 2016 నుండి పూర్తిగా సినిమాలకి దూరం అయిపోయారు.

ఒకప్పుడు అబ్బాస్ అంటే రాజా, నీ ప్రేమకై, నరసింహా, అనసూయ, ఇది సంగతి, రాజహంస, శ్వేతనాగు…సినిమాలు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్ యాడ్ లో కనిపించే సగటు ప్రచారకర్త అయ్యాడు. అయితే మొన్న ఒక ఇంటర్వ్యూ లో అబ్బాస్ గురించి అడుగగా పలు ఆసక్తికర విషయాలు చెప్పారు అతని ఆత్మీయ స్నేహితులు లో ఒకరు అయిన వినీత్ గారు.

అబ్బాస్ ఇప్పుడు న్యూజిలాండ్ లో ఉంటున్నాడు… అక్కడే తన కుటుంబంతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు.ఫేస్ బుక్ లో నాకు ఎక్కువగా టచ్ లో ఉంటాడు. నా ప్రాజెక్ట్స్ గురించి అడుగుతారు. నేను ఏ పరిశ్రమలో సినిమా చేస్తున్నానో అడిగి అక్కడి పెద్ద పెద్ద నటుల గురించి వారి సినిమాలా గురించి అడిగేవారని అంటున్నారు వినీత్. అబ్బాస్ తన చివరి సినిమా ‘పచక్కల్లమ్’ 2016 లో చేసిన మలయాళం సినిమా అది. అప్పటి నుండి అబ్బాస్ తన మోకానికి రంగు వెయ్యలేదు….