కోచ్ ను అంటున్నారని ఫైరైపోతోన్న కెప్టెన్ కోహ్లీ


Virat Kohli criticizes who commented Ravi Shastri
Virat Kohli criticizes who commented Ravi Shastri

కెప్టెన్ గా విరాట్ కోహ్లీ స్థాయి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్లేయర్ గా జట్టుకి ఎన్నో మరపురాని విజయాలను అందించిన కోహ్లీ, కెప్టెన్ అయ్యాక కూడా ఎక్కడా తగ్గట్లేదు. జట్టుని ముందుండి నడిపిస్తున్నాడు. ప్రస్తుతం కోహ్లీకి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడూ సరదాగా కనిపించే కోహ్లీకి ఇప్పుడు ఫుల్లుగా కోపం వచ్చేసింది. స్టేడియంలో అభిమానులను అలరిస్తూ ఇంకా గోల చేయమని ప్రోత్సహిస్తూ ఉంటాడు కోహ్లీ. ఇక ప్రెస్ మీట్స్ లో మీడియాతో ఎంత సరదాగా ఉంటాడో, ఎలా పంచ్ లు వేస్తాడో అందరికీ తెల్సిందే. అలాంటి కోహ్లీకి కోపం ఎందుకొచ్చిందీ అంటే తన కోచ్ ను అందరూ తిడుతుంటే తాను కూల్ గా ఎలా ఉంటాను అంటున్నాడు.

ఇంతకీ అసలు విషయంలోకి వెళితే.. టీమిండియా మెన్స్ కోచ్ రవిశాస్త్రి మీద సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్స్ పడతాయో అందరికీ తెల్సిందే. టీమిండియా కోచ్ గా రవిశాస్త్రిని కనీసం కన్సిడర్ చేయకుండా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఏ ప్లేయర్ మీదా రానన్ని మీమ్స్ రవిశాస్త్రిపై వస్తూ ఉంటాయి. తనని ఒక తాగుబోతుగా చిత్రీకరిస్తుంటారు మీడియాలో. టీం ఫొటోస్ లో కూడా రవిశాస్త్రి కూర్చున్న కుర్చీ కింద మందు బాటిల్ పెట్టి మరీ మీమ్స్ వేస్తుంటారు. రవిశాస్త్రి పెర్సొనాలిటీని కూడా వదలరు. తన పొట్టను కూడా కామెంట్ చేస్తుంటారు.

ఈ విషయమై విరాట్ కోహ్లీ స్పందించాడు. రవిశాస్త్రితో కలిపి తనను కూడా ట్రోల్ చేస్తుండడంతో కోహ్లీ గుస్సా అయ్యాడు. రవిశాస్త్రిని విమర్శించే ముందు జీవితంలో తాము ఏం సాధించాలో చూసుకోవాలని, రవిశాస్త్రి మొదట 10వ స్థానంలో బ్యాటింగ్ చేసేవాడని, అక్కడినుండి మొదలై ఓపెనర్ కూడా అయ్యాడని, టీమిండియాకు ఎన్నో మరపురాని  విజయాలు అందించాడని, అతణ్ణి కామెంట్ చేసేముందు ఆయన సాధించింది వాళ్ళు సాధించి చూపించాలని, కనీసం అంత ధైర్యమైనా ఉండాలని కోహ్లీ అంటున్నాడు. ఇంటి దగ్గర ఖాళీగా ఉండేవాళ్ళే ఇలా కామెంట్ చేస్తుంటారని అంటున్నాడు.