`విరాట‌ప‌ర్వం` రెడ్ సెల్యూట్ టు ఉమెన్స్‌!

Virata parvam team red salute to womans
Virata parvam team red salute to womans

మహిళలందరికీ నివాళి అర్పిస్తూ చిత్ర బృందం `విరాట పర్వం` మహిళల దినోత్సవ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. `విరాట పర్వం` లోని కీలక పాత్ర‌ల్లో న‌టించిన‌ ప్రముఖ మహిళల వ్యక్తిత్వాలను వివరిస్తూ హీరో రానా వాయిస్‌తో ఓ వీడియోని అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా చిత్ర బృందం ఓ వీడియోని విడుద‌ల చేసింది. `అద్భుతమైన మహిళలందరికీ రెడ్ సెల్యూట్`అంటే రానా త‌మ సినిమాలో న‌టించిన వారికి రెడ్ సెల్యూట్ చేశారు.

వీడియో ద్వారా వెళితే `చ‌రిత్ర‌లో దాగిన క‌థ‌ల‌కు తెర‌లేపిన ప్రేమ త‌న‌ది. ప్రేమ కూడా మాన‌వ స్వేచ్ఛ‌లో భాంగ అని న‌మ్మిన వ్య‌క్త‌త్వం త‌న‌ది. మ‌హా సంక్ష‌భ‌మే గొప్ప శాంతికి దారి తీస్తుంద‌ని న‌మ్మిన విప్ల‌వం త‌న‌ది. అడ‌వి బాట‌ప‌ట్టిన అనేక‌మంది వీరుల త‌ల్లుల‌కు వీళ్లు ప్ర‌తిరూపాలు. వీళ్ల మార్గం అన‌న్యం..అసామాన్యం..రెడ్ సెల్యూట్ లు గ్లోరియ‌స్ ఉమెన్స్‌` అంటూ రానా మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళా లోకానికి త‌న రెడ్ సెల్యూట్‌ని ప్ర‌క‌టించారు.

సాయి పల్లవిది గొప్ప ప్రేమకథ…, నందిత దాస్.. మానవ హక్కుల నేత‌గా, ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో భాగమని నమ్మిన వ్య‌క్తిగా, ప్రియమణి ఒక విప్లవాత్మక నాయకునాలు, గొప్ప సంక్షోభం శాంతికి దారితీస్తుందని న‌మ్మిన వ్య‌క్త‌త్వం ఆమెదిగా, ఈశ్వ‌రీరావు, జరీనా వహాబ్… అడవులలో తిరుగుబాటును ఎంచుకున్న అనేక ధైర్యవంతుల తల్లులకు గుర్తుగా ఈ వీడియోలో సూచిచారు.