విశాల్ పెళ్లి ఆగిపోయిందా ?


Vishal and Anisha Alla
Vishal and Anisha Alla

హీరో విశాల్ పెళ్లి ఆగిపోయిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి . విశాల్ హైదరాబాద్ కు చెందిన అమ్మాయి అనిషా రెడ్డి ని ప్రేమించాడు . ఆమధ్య అంగరంగ వైభవంగా వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది . ఇక ఆగస్టు లేదా సెప్టెంబర్ లో పెళ్లి అన్నమాట వినిపించింది కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనీషా – విశాల్ ల మధ్య పొసగడం లేదని అందుకే పెళ్లి ఆగిపోయినట్లు తెలుస్తోంది .

ఇందుకు ఉదాహరణ అనీషా రెడ్డి తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో విశాల్ తో దిగిన ఫోటోలను డిలీట్ చేయడమే కారణమని అంటున్నారు . అయితే ఈ వార్తపై ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు , కానీ అందుతున్న సమాచారం బట్టి త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయొచ్చని తెలుస్తోంది . నిత్యం వివాదాలతో సహవాసం చేస్తున్న విశాల్ పెళ్లి పై ఇలా నీలినీడలు కమ్ముకోవడం ఫ్యాన్స్ ని కలవరపెట్టే అంశమే !