టెంపర్ లాగే అయోగ్య హిట్ అవుతుందా ?


Vishal ayogya teaser talk
2015 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . టెంపర్ తో ఎన్టీఆర్ మరోసారి నటవిశ్వరూపం చూపించి నందమూరి అభిమానులను విశేషంగా అలరించాడు . కట్ చేస్తే టెంపర్ చిత్రాన్ని హిందీలో సింబా గా రీమేక్ చేశారు . అక్కడ కూడా టెంపర్ రీమేక్ సూపర్ హిట్ అయ్యింది . ఇక ఇప్పుడేమో తమిళంలో అయోగ్య టైటిల్ తో రీమేక్ అవుతోంది టెంపర్ చిత్రం .
ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తున్నాడు . రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఐటెం సాంగ్ చేయనుంది . తాజాగా అయోగ్య టీజర్ రిలీజ్ అయ్యింది . ఈ టీజర్ మాస్ ని అలరించేలా రూపొందింది . దాంతో సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నారు . తెలుగులో అలాగే హిందీలో రెండు బాషలలో సూపర్ హిట్ అయిన టెంపర్ తమిళంలో కూడా హిట్ అవుతుందా ? చూడాలి .

English Title: Vishal ayogya teaser talk