విశాల్ `చ‌క్ర‌` ట్రైలర్ గ్రిప్పింగ్ అండ్ ప్రామిసింగ్‌!


విశాల్ `చ‌క్ర‌` ట్రైలర్ గ్రిప్పింగ్ అండ్ ప్రామిసింగ్‌!
విశాల్ `చ‌క్ర‌` ట్రైలర్ గ్రిప్పింగ్ అండ్ ప్రామిసింగ్‌!

డిజిట‌ల్ ఇండియా.. దీనిపై ఓ ద‌శ‌లో వార్ ప్ర‌క‌టించిన హీరో విశాల్‌. దీనికి వ్య‌తిరేకంగా విశాల్ న‌టించి, నిర్మించిన చిత్రం `అభిమ‌న్యుడు`. సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ఇంచు మించు కొన‌సాగింపుగా వ‌స్తున్న చిత్రం `చ‌క్ర`. విశాల్ న‌టిస్తూ నాలుగు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఎం.ఎస్‌. అనంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్ర‌ద్ధా శ్రీ‌నాధ్‌, రెజీనా, సృష్టి ధాంగే న‌టించారు. ఈ చిత్ర ట్రైల‌ర్‌ని శ‌నివారం తెలుగు, త‌మిళ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేశారు.

బ్యాంక్ రాబ‌రీ, హ్యాకింగ్‌, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఆగ‌స్టు 15 ఇండిపెండెన్స్ డే. హైద‌రాబాద్ సిటీ మొత్తం హై అల‌ర్ట్‌తో వుంటుంది. కానీ ఆ రోజు .. అంటూ హీరో విశాల్ వాయిస్ ఓవ‌ర్‌తో ట్రైల‌ర్ మొద‌లైంది. 2 నిమిషాల 7 సెకంన్‌ల నిడివితో ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌గా విశాల్ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు.

ఒక దేశాన్ని బెదిరించే తీవ్ర వాదుల యాక్టివిటీస్‌ని గ‌మ‌నించ‌డానికి నేష‌న‌ల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసే  రీ
సెర్చ్ కంటే ఓ స‌గ‌టు మ‌నిషి అవ‌స‌రాలు, వాడి ఆశ‌లు తెలుసుకోవ‌డం కోసం ఓ కార్పొరేట్ కంప‌నీ చేసే రీసెర్చే ఎక్కువ అంటారు. ఖ‌చ్చితం‌గా మ‌నం వెతికే క్రిమిన‌ల్ మ‌న కంటికి క‌నిపించ‌డు. కంటికి క‌నిపించ‌ని వైర‌స్ మాత్ర‌మే కాదు వైర్ లెస్ నెట్ వ‌ర్క్ కూడా ప్ర‌మాద‌మే. వెల్‌క‌మ్ టు డిజిట‌ల్ ఇండియా.. వంటి డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ట్రైల‌ర్ గ్రిప్పింగ్‌గా, ప్రామిసింగ్‌గా వుంది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని హీరో విశాల్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.