తమిళనాట హిట్టు మరి ఇక్కడ


vishal confident on abhimanyudu

హీరో విశాల్ నటించిన అభిమన్యుడు జూన్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అసలు ఈ సినిమా మేలోనే రావాల్సి ఉండే కానీ అదే సమయంలో ఇక్కడ తెలుగునాట పలు సినిమాలు విడుదల అవుతుండటం థియేటర్ ల సమస్య కూడా ఉండటంతో విడుదల వాయిదా వేశారు . కట్ చేస్తే ” ఇరుంబుదురై ” తమిళనాట విడుదలై భారీ విజయం సాధించింది . సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం విశాల్ కెరీర్ లోనే నెంబర్ వన్ దిశగా దూసుకుపోతోంది .

ఇక ఇప్పుడేమో ఇక్కడ తెలుగునాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు విశాల్ . అభిమన్యుడు పేరుతో విడుదల అవుతున్న ఈ చిత్రంలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నాడు . సమంత హీరోయిన్ గా నటించింది . విశాల్ సొంత సినిమా కావడంతో అభిమన్యుడు పై చాలా ఆశలే పెట్టుకున్నాడు . గతకొంత కాలంగా విశాల్ చిత్రాలు తెలుగునాట సరిగ్గా ఆడటం లేదు దాంతో ఈ అభిమన్యుడు తప్పకుండా హిట్ అవుతుందని నమ్ముతున్నాడు . మరి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారా ? లేదా ? అన్నది తెలియాలంటే మరో 6 రోజులు ఎదురు చూడాల్సిందే .