హీరో విశాల్ కు గాయాలు


Vishal injured in shooting

తమిళ స్టార్ హీరో విశాల్ కు షూటింగ్ లో తీవ్ర గాయాలయ్యాయి దాంతో చిత్ర యూనిట్ షాక్ అయ్యింది . సంచలనం సృష్టించే ఈ సంఘటన టర్కీ లో జరిగింది . ప్రముఖ తమిళ దర్శకులు సుందర్ సి దర్శకత్వంలో విశాల్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు . కాగా ఆ సినిమా కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు . యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో విశాల్ కు తీవ్ర గాయాలయ్యాయి . కాలు , చేయి ఫ్రాక్చర్ అయ్యాయి .

 

దాంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు . ఎడమ కాలు , ఎడమ చేయి రెండు కూడా దెబ్బతిన్నాయి . విశాల్ కాలుకి , చేయికి కట్లు కట్టి ఉన్న స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇటీవలే హైదరాబాద్ కు చెందిన అనీషా రెడ్డి ని ప్రేమించి ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు విశాల్ . ఈలోపు ఇలా గాయాల పాలయ్యాడు .

English Title : Vishal injured in shooting