విశాల్ పై ఘోరమైన కామెంట్ చేసాడు


bharathi raja
bharathi raja

హీరో విశాల్ ని పందికొక్కు తో పోల్చి ఘోరమైన కామెంట్ చేసాడు ప్రముఖ తమిళ దర్శకులు భారతీరాజా . తమిళ నిర్మాతల మండలిలో ఓ పందికొక్కు చేరిందని దాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చాడు భారతీరాజా . నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ ని చిత్తుచిత్తుగా ఓడించి భాగ్యరాజా ప్యానల్ ని గెలిపించుకోవాలని తమిళ నటులకు పిలుపునిచ్చాడు సీనియర్ దర్శకుడు భారతీరాజా .

నడిగర్ సంఘం ఎన్నికలు అయ్యాక దాన్ని తమిళ నటుల సంఘం గా పేరు మార్చాలని సంచలన వ్యాఖ్యలు చేసాడు భారతీరాజా . నడిగర్ సంఘం లో దక్షిణాదికి చెందిన నాలుగు బాషల నటీనటులు సభ్యులుగా కొనసాగుతున్నారు . తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ బాషల నటీనటులు సభ్యులుగా ఉన్నారు . అయితే ఎన్నికలు అయ్యాక తమిళ నటీనటుల సంఘం గా పేరు మార్చితే మిగతా బాషల నటీనటులు ఎలా సభ్యులుగా కొనసాగుతారో ? మొత్తానికి విశాల్ ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువే అవుతున్నారు .