యూట్యూబ‌ర్‌కు వార్నింగ్ ఇచ్చిన విశ్వ‌క్‌సేన్‌!

యూట్యూబ‌ర్‌కు వార్నింగ్ ఇచ్చిన విశ్వ‌క్‌సేన్‌!
యూట్యూబ‌ర్‌కు వార్నింగ్ ఇచ్చిన విశ్వ‌క్‌సేన్‌!

యూట్యూబ‌ర్‌కు యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇబ్బందిక‌ర‌మైన శీర్షిక‌తో విశ్వ‌క్‌సేన్‌పై ఓ యూట్యూబ‌ర్ ఓ వీడియోసిన వైర‌ల్ చేశాడు. ఇది విశ్వ‌క్‌సేన్ దృష్టికి  వెళ్లింది. దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న విశ్వ‌క్‌సేన్ స‌ద‌రు యూట్యూబ‌ర్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స‌ద‌రు యూట్యూబ‌ర్‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ఇలాంటి వీడియోలు పెట్టేముందు మ‌న ఇంట్లో ఆడ‌వాళ్లు వున్నార‌న్న ఇంగిత జ్ఞానంతో వ్య‌వ‌హ‌రించాల‌ని మండి ప‌డ్డారు. ఆ వీడియో పెట్టిన వ్య‌క్తి 24 గంట‌ల్లో క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ఇంకో వీడియో పెట్ట‌ర‌పోతే మీ ఇంటికి వ‌చ్చి వీడియో పెట్టిస్తాన‌ని గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చారు.  వివ‌రాల్లోకి వెళితే… నందితా శ్వేత హీరోయిన్‌గా న‌టించిన `అక్ష‌ర` చిత్రంలోని ఓ పాట రిలీజ్ కార్య‌క్ర‌మం ఇటీవ‌ల జ‌రిగింది.

దానికి విశ్వ‌క్‌సేన్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్‌సేన్ గురించి నందితాశ్వేత మాట్లాడుతూ ఈ కార్య‌క్ర‌మానికి విశ్వ‌క్‌సేన్ రావ‌డం ఆనందంగా వుందిని, ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పింది. అయితే ఓ యూట్యూబ్ ఛాన‌ల్ `విశ్వ‌క్ నీకు ఏం కావాల‌న్నా సిగ్గు లేకుండా అడుగు చేస్తా` అంటూ ఇబ్బందిక‌ర‌మైన థంబ్ లైన్‌తో ఓ వీడియోని పోస్ట్ చేశారు. దీనిపై విశ్వ‌క్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 24 గంట‌ల్లో వీడియోని తొల‌గించ‌క‌పోతే ఇంటికి వ‌చ్చి మారీ మార్పిస్తాన‌ని వార్నింగ్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.