విశ్వక్ సేన్ HIT టీజర్ రిలీజ్ – “అదిరింది”


విశ్వక్ సేన్ HIT టీజర్ రిలీజ్ – “అదిరింది”
విశ్వక్ సేన్ HIT టీజర్ రిలీజ్ – “అదిరింది”

ఒక పోలీస్ ఆఫీసర్, పేరు విక్రం. ఒక కేసు.. అది కూడా మిస్సింగ్ కేస్. ఒక క్రిమినల్. పైగా చేసింది ఒక్క నేరం కాదు.. తవ్వేకొద్దీ ఎన్నో నేరాలు. ఎన్నో అనుమానాలు. ఒక సమస్య. విక్రం ఇక డ్యూటీ చెయ్యకుండా, విశ్రాంతి తీసుకోమని వేధిస్తోంది. కానీ కనిపెట్టాల్సిన ఆ కేసు తనని వెంటాడుతోంది. దొరికే ప్రతీ క్లూ అతన్ని మరింతగా రెచ్చగొడుతున్నాయి. ఇప్పుడు విక్రం ఏం చేస్తాడు.? అంతలా ఆ కేసు ఇంపార్టెన్స్ ఏంటి.? తను కోల్పోయింది ఆ కేసులో తనకు దొరుకుతోంది ఏంటి.? అసలు తన జీవితాన్ని, తన డ్యూటీ ని సవాల్ చేస్తున్న క్రిమినల్ ఎవరు.?

తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 28 HIT సినిమా చూడాల్సిందే అంటున్నారు. చిత్ర యూనిట్. కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసిన టీజర్ లో మనం మాట్లాడుకుంటున్న అంశాలు అన్నీ ఉన్నాయి. విశ్వక్ తో పాటు హరితేజ, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ఇంకా అనేకమంది నటీనటులు కనిపిస్తున్నారు. స్వరసాగర్ వివేక్ సాగర్ కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, “ఎవరు” లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ఎడిట్ చేసిన ఎడిటర్ గ్యారీ బి.హెచ్ లాంటి వాళ్ళ సూపర్ వర్క్ ఇందులో కనిపిస్తోంది. అలాగే కెమెరా వర్క్ మనికందన్ సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక బాహుబలి సినిమాకు స్టైలింగ్ చేసిన ప్రశాంతి త్రిపురనేని గారు మరియు నేచురల్ స్టార్ నాని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.