“పాగల్” గా వస్తానంటున్నవిశ్వక్ సేన్


Vishwak Sen in and as PAGAL
Vishwak Sen in and as PAGAL

తెలుగు సినిమా హీరోలు అంతకుముందు హీరో పాత్ర లేదా హీరోయిజం ఎలివేట్ అయ్యేలా టైటిల్స్ పెట్టుకోవాలంటే… ఇంద్రుడు,చంద్రుడు,రాముడు,కృష్ణుడు అని టైటిల్స్ పెట్టుకునేవాళ్ళు. కానీ ఒకే ఒక వ్యక్తి వచ్చి ఇండస్ట్రీలో తిట్లనే సినిమా టైటిల్స్ గా అందులోనూ హీరో కి సంబంధించిన టైటిల్స్ గా పెట్టడం అలవాటు చేసి సక్సెస్ కూడా అయ్యారు. ఆ వ్యక్తి పేరు పూరి జగన్నాథ్. ఇడియట్, దేశముదురు పోకిరి,రోగ్ ఇలా హీరోయిజానికి తనదైన స్టైల్ లో  తిట్లను సింక్ చేసి హిట్లు కొట్టాడు పూరీ సర్.

ఇప్పుడు అదే పూరి జగన్నాథ్ బాటలో పయనిస్తున్నారు మన విశ్వక్ సేన్.  తన తాజా సినిమాకు “పాగల్” అనే టైటిల్ ను ఖరారు చేసారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నరేష్ కుప్పిలి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఇక అప్పుడెప్పుడో అందాల రాక్షసి నుంచి మొన్నవచ్చిన అర్జున్ రెడ్డి వరకు విలక్షణమైన సంగీతం అందించే రధాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ పని చేస్తున్నారు.

విశ్వక్ గత సినిమా అయినా “హిట్” కు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా వ్యవహరించిన మనికందన్ సర్ ఈ సినిమాకు కూడా పని చేస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన గ్యారీ సర్ ఈ సినిమాకు ఎడిటర్.హీరోయిన్  ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని చాలా నిరాడంబరంగా మరియు తక్కువ మంది మనుషుల మధ్య నిర్వహించారు.