విశ్వ‌క్‌సేన్ పేరు వెన‌క ఇంత స్టోరీ వుందా?

విశ్వ‌క్‌సేన్ పేరు వెన‌క ఇంత స్టోరీ వుందా?
విశ్వ‌క్‌సేన్ పేరు వెన‌క ఇంత స్టోరీ వుందా?

`వెళ్లి పోమాకే` చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో విశ్వ‌క్‌సేన్‌. `ఫ‌ల‌క్ నుమా దాస్‌` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా కూతా త‌న స‌త్తా ఏంటో నిరూపించుకున్న విశ్వ‌క్ ప్ర‌స్తుతం హీరోగా రెండు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్నారు. ఒక‌టి కొత్త ద‌ర్శ‌కుడితో చేస్తున్న పాగ‌ల్ కాగా మ‌రొక‌టి `గ్రామి` చిత్రం. ఇదిలా వుంటే తాజాగా ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న అలీ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `అలీతో స‌ర‌దాగా` కార్య‌క్ర‌మంలో విశ్వ‌క్‌సేన్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్ త‌న పేరు వెన‌కున్న ఆస‌క్తిక‌ర‌మైన స్టోరీని వెల్ల‌డించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. విశ్వ‌క్‌సేన్ త‌న అస‌లు పేరు కాద‌ని, జాత‌కాల కార‌ణంగా అలా త‌న పేరుని మార్చుకోవాల్సి వ‌చ్చింద‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశాడు. త‌న అస‌లు పేరు `దినేష్‌` అని.. జాత‌కాల కార‌ణంగా త‌న పేరుని ముందు విశ్వ‌క్‌సేన అని పెట్టుకున్నాన‌ని  అలా పెట్టుకుంటే జీవితాంతం క‌ష్ట‌ప‌డ‌తావ‌ని మా నాన్న చెప్పార‌ని, దాంతో త‌న పేరుని విశ్వ‌క్ సేన్‌గా మార్చుకున్నాన‌ని ఈ సంద‌ర్భంగా అలీ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా తెలిపాడు విశ్వ‌క్‌.

త‌న పేరు బెంగాళీ న‌టుడి పేరులా వుంద‌ని ఆ త‌రువాత కూడా నాన్న అభ్యంత‌రం చెప్పార‌న్నార‌ని త‌న పేరు వెన‌కున్న అస‌లు స్టోరీని ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌పెట్టారు. దినేష్ అలియాస్ విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న `పాగ‌ల్‌` చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న విష‌యం తెలిసిందే. ఇందుల‌లో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ న‌టిస్తోంది.