బాహుబలి 2 రికార్డ్ ని బద్దలు కొట్టిన విశ్వరూపం 2


vishwaroopam 2 beats baahubali 2 first day collectionsకమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2 బాహుబలి 2 రికార్డ్ ని బద్దలు కొట్టింది . అదేంటి విశ్వరూపం 2 డిజాస్టర్ కదా ! మరి బాహుబలి 2 రికార్డ్ బద్దలు కావడం ఏంటి అని అనుకుంటున్నారా ? కమల్ హాసన్ తమిళ స్టార్ హీరో కావడంతో సహజంగానే కమల్ సినిమా విడుదల అవుతుందంటే ఆమాత్రం అంచనాలు ఉంటాయి దానికి తోడు విశ్వరూపం వంటి సూపర్ హిట్ చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో ఆ అంచనాలు మరింతగా ఎరిగాయి దాంతో ఒక్క చెన్నై మహానగరంలోనే 93 లక్షల వసూళ్ల ని మొదటి రోజున వసూల్ చేసింది విశ్వరూపం 2.

బాహుబలి 2 చిత్రానికి మొదటి రోజున 92 లక్షల వసూళ్లు రాగా విశ్వరూపం 2 కి 93 లక్షలు వచ్చాయి దాంతో బాహుబలి 2 రికార్డ్ బద్దలైంది . బాహుబలి కంటే ముందు కాలా , వివేగం , కబాలి , తేరి సినిమాలు వసూళ్ల పరంగా అగ్ర భాగంలో నిలిచాయి . బాహుబలి 2 మొదటి రోజు వసూళ్ల ని విశ్వరూపం 2 దాటేసినప్పటికీ ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు లేకుండా పోయాయి . సినిమా చూసిన వాళ్ళు పెదవి విరుస్తున్నారు .

English Title: vishwaroopam 2 beats baahubali 2 first day collections