విశ్వరూపం 2 టాక్ ఎలా ఉందంటే


vishwaroopam 2 preview show talk

కమల్ హాసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ” విశ్వరూపం 2” . విశ్వరూపం సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ కు భారీ డిమాండ్ ఏర్పడింది అయితే సినిమా అనుకున్న సమయంలో విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ ఇన్నాళ్లకు విడుదల అవుతోంది . ఈరోజు విశ్వరూపం 2 తెలుగు , తమిళ , హిందీ బాషలలో విడుదల కాగా అమెరికాలో ప్రీమియర్ షోలు ముందుగానే పడ్డాయి . ఆ షోల ప్రకారం విశ్వరూపం 2 టాక్ ఎలా ఉందంటే …….

అనుకున్న స్థాయిలో సినిమా లేదని పెదవి విరుస్తున్నారు సినిమా చూసిన వాళ్ళు . ఫస్టాఫ్ లో రొమాన్స్ తప్ప పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవని అయితే సెకండాఫ్ లో కొంత బెటర్ గా ఉందని ఓవరాల్ గా విశ్వరూపం2 అంచనాలను అందుకోలేక పోయిందని టాక్ . కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది , తన పాత్ర తో అదరగొట్టాడట ! పూజా కుమార్ , ఆండ్రియా ల గ్లామర్ కూడా కలిసి వచ్చింది అయితే కథనం ఆకట్టుకునే విధంగా లేదని , దర్శకుడిగా కమల్ తేలిపోయాడని అంటున్నారు . ఇది ఓవర్ సీస్ టాక్ ఇక తెలుగు రాష్ట్రాలలో అలాగే తమిళ్ లో ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే .

English Title: vishwaroopam 2 preview show talk