విశ్వరూపం 2 ట్రైలర్ టాక్


vishwaroopam 2 trailer talkకమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2 చిత్ర ట్రైలర్ ని ఎన్టీఆర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే . విశ్వరూపం 2 ట్రైలర్ ఎన్టీఆర్ కు బాగా నచ్చింది అందుకే కమల్ హాసన్ పట్ల తనకున్న గౌరవాన్ని ప్రదర్శిస్తూ అతడ్ని పొగడ్తల వర్షం కురిపించాడు . విశ్వరూపం చిత్రం విడుదల సమయంలో ఎన్నో ఆటుపోట్ల ని ఎదుర్కొన్నాడు కమల్ , దాంతో ఒక దశలో భారతదేశం విడిచి వేరే దేశం వెళ్లిపోతానని అన్నాడు కూడా . కట్ చేస్తే విశ్వరూపం విడుదల అయ్యింది సంచలన విజయాన్ని సాధించింది దాంతో విశ్వరూపం 2 ని కూడా వెంటనే విడుదల చేస్తానని అన్నాడు కానీ చాలా రోజులే పట్టింది .

ఎట్టకేలకు నిన్న విశ్వరూపం 2 ట్రైలర్ విడుదల అయ్యింది , ఆ ట్రైలర్ చాలా బాగుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి . కమల్ హాసన్ సరసన ప్రియా , ఆండ్రియా నటించగా జిబ్రాన్ సంగీతం అందించాడు . ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ట్రైలర్ కు ఫీడ్ బ్యాక్ బాగా రావడంతో కమల్ తో పాటు ఆ చిత్ర బృందం సంతోషంగా ఉంది .