ఆ సినిమా చూసి బుర్ర హీటెక్కింద‌ట‌!


Viswak sen Sensational comments on F2
Viswak sen Sensational comments on F2

కొన్ని సినిమాలు ఎప్పుడు ఎలా బ్లాక్ బ‌స్ట‌ర్‌లుగా నిలుస్తాయో ఎవ‌రూ ఊహించ‌లేదు. కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్స్ అయ్యే అవ‌కాశం వున్నా స‌మ‌యం క‌లిసి రాక‌పోవ‌డంతో జ‌స్ట్ హిట్‌లుగానే మిగిలిపోతుంటాయి. 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న చిత్రం `ఎఫ్‌2`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దిల్ రాజు నిర్మించారు.

విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ తొలిసారి క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మిది. బాక్సాఫీస్ వ‌ద్ద అనూహ్యంగా ఈచిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా వంద కోట్ల క్ల‌ప్‌లో చేరింది. అయితే ఈ సినిమా ఓ యంగ్ హీరోకు 15 నిమిషాల‌కే బుర్ర హీటెక్కించేసింద‌ట‌. దాంతో వెంట‌నే థియేట‌ర్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాడ‌ట‌.

అలా బ‌య‌టికి వ‌చ్చిన ఆ యంగ్ హీరో మ‌రెవ‌రో కాదు విశ్వ‌క్‌సేన్‌. వెళ్లిపోమాకే, ఈ న‌గ‌రానికి ఏమైంది. ఫ‌ల‌క్‌నుమాదాస్, రీసెంట్‌గా `హిట్` వంటి చిత్రాల‌తో హీరోగా త‌న‌కంటూ సెప‌రేట్ క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. అత‌నికి `ఎఫ్‌2` న‌చ్చ‌లేద‌ట‌. ఈ విష‌యాన్ని ఓ టాక్ షోలో నిర్మొహ‌మాటంగా చెప్పేశాడు. అయితే త‌న‌కు న‌చ్చ‌నంత మాత్రాన అది చెడ్డ సినిమా కాద‌ని, బాక్సాఫీస్ వ‌ద్ద అదే చిత్రం భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింద‌ని చెప్ప‌డం విశేషం.