రెబ‌ల్ హీరోకు మ‌హేష్ కావాల‌ట‌!


రెబ‌ల్ హీరోకు మ‌హేష్ కావాల‌ట‌!
రెబ‌ల్ హీరోకు మ‌హేష్ కావాల‌ట‌!

కెరీర్ తొలి నాళ్ల నుంచి ఆన్ స్క్రీన్‌, ఆఫ్ స్క్రీన్‌ అత‌నో రెబ‌ల్‌. వ‌రుస వివాదాలు చుట్టుముట్టినా ఎలాంటి బెరుకు అత‌నిలో క‌నిపించ‌దు. దేన్నైనా సింపుల్‌గా తీసుకునే ఆ హీరో మ‌రెవ‌రో కాదు విశ్వ‌క్‌సేన్‌. కేవ‌లం 12 ల‌క్ష‌ల‌తో `వెళ్లిపోమాకే` చిత్రాన్ని రూపొందించి దిల్ రాజు చేత రిలీజ్ చేయించి శ‌భాష్ అనిపించుకున్నాడు.

త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా అవ‌మానించార‌ని తానే నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా మారి `ఫ‌ల‌క్‌నుమాదాస్‌` చిత్రంతో సంచ‌ల‌నం సృష్టించారీ యువ హీరో. ఈ సినిమాతో వివాదాల్లోనూ ఇరుక్కున్న విశ్వ‌క్‌సేన్ తాజాగా `హిట్` సినిమాతో సాలీడ్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడితో `పాగ‌ల్‌` సినిమా చేస్తున్నాడు. క‌రోనా కార‌ణంగా రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగిపోయింది.

తాజాగా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచాడు విశ్వ‌క్‌సేన్‌. `ఫ‌ల‌క్‌నుమాదాస్‌` చిత్రంతో  ద‌ర్శ‌కుడిగా మారిన ఈ రెబ‌ల్ హీరోకు స్టార్ హీరో మ‌హేష్‌ని డైరెక్ట్ చేయాల‌ని వుంద‌ట‌. ఛాన్స్ ఇస్తే త‌నేంటో నిరూపిస్తా అంటున్నాడు. ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించి షాకిచ్చాడు. మ‌హేష్ న‌టించిన `ఒక్క‌డు` చిత్రం త‌న‌కు ఆల్ టైమ్ ఫేవ‌రేట్ అని మ‌హేష్ ఒక్క ఛాన్స్ ఇస్తే అంత‌కు మించిన సినిమా తీసి చూపిస్తాన‌ని అంటున్నాడు విశ్వ‌క్‌సేన్ మరి మ‌హేష్ ఆ ఛాన్స్ ఇస్తాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.