నేచుర‌ల్ స్టార్ నాని 28కి డైరెక్ట‌ర్ అత‌నే!నేచుర‌ల్ స్టార్ నాని 28కి డైరెక్ట‌ర్ అత‌నే!
నేచుర‌ల్ స్టార్ నాని 28కి డైరెక్ట‌ర్ అత‌నే!

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస‌గా ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ తన 28 వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించ‌బోతోంది. ఈ చిత్రానికి `బ్రోచేవారెవ‌రురా` ఫేమ్  వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నారు.ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఈ చిత్రంలో  హీరో నాని మలయాళ నటి నజ్రియా ఫహద్ తో రొమాన్స్  చేయ‌బోతున్నారు. రేపు మంచి రోజంటా సినిమా కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నాం. ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది అనౌన్స్ చేస్తాం` అంటూ ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. అన్న‌ట్టుగానే ఈ ప్రాజెక్ట్‌కి వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని ప్ర‌క‌టించింది.

`రాజా రాణి` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన న‌జ్రియాని ఈ మూవీ కోసం హీరోయిన్‌గా పిక్స్ చేశారు. ఈ నెల 21న ఈ చిత్ర టైటిల్‌ని ప్ర‌క‌టిస్తామంటూ వెల్ల‌డించారు. నాని ప్ర‌స్తుతం `శ్యామ్ సింగ‌రాయ్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌స‌త్తుం `ట‌క్ జ‌గ‌దీష్‌` చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.