వివేక్ ఆత్రేయకు బంప‌ర్ ఆఫ‌ర్‌!

వివేక్ ఆత్రేయకు బంప‌ర్ ఆఫ‌ర్‌!
వివేక్ ఆత్రేయకు బంప‌ర్ ఆఫ‌ర్‌!

శ్రీ‌విష్ణు హీరోగా న‌టించిన చిత్రం `మెంట‌ల్ మ‌దిలో`. రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రం ద్వారా వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆ త‌రువాత చేసిన `బ్రోచేవారెవ‌రురా` వివేక్‌కు ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అదే సినిమా నేచుర‌ల్ స్టార్ ని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని కూడా తెచ్చిపెట్టింది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం త్వ‌ర‌లో తెర‌పైకి రాబోతోంది.

యంగ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో నాని త‌న‌తో సినిమా చేయ‌డానికి ఇటీవ‌లే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. విభిన్న‌మైన క‌థ‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌బోతోంది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం నాని న‌టించిన `వి` త్వ‌ర‌లో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. క‌రోనా కార‌ణంగా మార్చి 25న విడుద‌ల చేయాల‌నుకున్న ఈ చిత్రాన్ని వాయిదా వేసిన విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే నాని ప్ర‌స్తుతం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో `ట‌క్ జ‌గ‌దీష్‌`, `ట్యాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్య‌న్  తెర‌కెక్కించ‌నున్న `శ్యామ్ సింగ్‌రాయ్‌` చిత్రాల్లో న‌టిస్తున్నారు. అయితే ఇవి చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గానే వివేక్ ఆత్రేయ చిత్రాన్ని ఈ ఏడాదే సెట్స్‌పైకి తీసుకురానున్నార‌ని తెలుస్తోంది.