ఐశ్వర్యరాయ్ పై వివాదాస్పద కామెంట్ చేసిన హీరో


ఐశ్వర్యరాయ్ పై వివాదాస్పద కామెంట్ చేసి చిక్కుల్లో ఇరుక్కున్నాడు బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ . దేశ వ్యాప్తంగా ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంటూ పెద్ద హంగామా మొదలైన విషయం తెలిసిందే . ఎగ్జిట్ పోల్స్ అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పడంతో గందరగోళం నెలకొంది దాంతో కాబోలు ఒపీనియన్ పోల్ , ఎగ్జిట్ పోల్ , రిజల్ట్ అంటూ ఐశ్వర్యరాయ్ మూడు రకాల ఫోటోలను పోస్ట్ చేసాడు వివేక్ ఒబెరాయ్ .

ఆ ఫోటోలే ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి . ఇంతకీ వివేక్ పోస్ట్ చేసిన ఫోటోలు ఏంటో తెలుసా …… ఒకప్పుడు ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. దాంతో ఆ ఇద్దరి పిక్ పెట్టి ఒపీనియన్ పోల్ అని పెట్టాడు . ఇక వివేక్ ఒబెరాయ్ తో కూడా లవ్వాయణం సాగించింది ఐశ్వర్య పెళ్లి వరకూ వెళ్ళింది వ్యవహారం కానీ పెళ్లి అనుకున్నది కాస్త మారిపోయింది ఆ వెంటనే అభిషేక్ బచ్చన్ తో అనూహ్యంగా ఐశ్వర్యరాయ్ పెళ్లి అయ్యింది . అందుకే ఎగ్జిట్ పోల్ లో వివేక్ తో ఐశ్వర్య ఉన్న ఫోటోని పెట్టాడు , ఇక రిజల్ట్ లో అభిషేక్ తో పాటుగా తన కూతురు తో ఉన్న ఐష్ ఫోటో ని పోస్ట్ చేసాడు . అంటే ఐశ్వర్యరాయ్ ని ఘోరంగా అవమానించినట్లే కదా ! అందుకే జాతీయ మహిళా కమీషన్ తీవ్రంగా స్పందించి నోటీసులు జారీ చేసింది వివేక్ ఒబెరాయ్ కి .