యంగ్ హీరో వర్సెస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌!


యంగ్ హీరో వర్సెస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌!
యంగ్ హీరో వర్సెస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌!

టాలీవుడ్‌లో వున్న సంగీత ద‌ర్శ‌కుల్లో అన్ కాంప్ర‌మైజ్డ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ వివేక్ సాగ‌ర్‌. అవ‌కాశాల కోసం ఎవ‌రినీ అడ‌గ‌డం ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కి న‌చ్చ‌దు. అయితే త‌న వ‌ర‌కు వ‌చ్చిన సినిమా విష‌యంలో మాత్రం ఎలాంటి రాజీ లేకుండా సంగీతం అందించ‌డానికి, బెస్ట్ ఇవ్వ‌డానికి ట్రై చేస్తుంటాడు. `పెళ్లి చూపులు` సినిమాతో త‌న కెరీర్‌ని ప్రారంభించిన వివేక్ సాగ‌ర్ యుద్ధం శ‌ర‌ణం, స‌మ్మోహ‌నం,  ఈన‌గ‌రానికి ఏమైంది`.  `ఫ‌ల‌క్‌నుమాదాస్‌, బ్రోచే వారెవ‌రురా, హిట్ వంటి చిత్రాల‌కు సంగీతం అందించాడు.

త‌న‌కు న‌చ్చితే ఎంత‌వ‌ర‌కైనా వెళ్లే వివేక్ సాగ‌ర్ తాజాగా వార్త‌ల్లో నిలిచాడు. యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ చేసిన ప‌నికి వివేక్ సాగ‌ర్ హ‌ర్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల మే 20న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని విశ్వ‌క్‌సేన్ `మాస్ కా బాప్` పేరుతో ఎన్టీఆర్‌కి ట్రిబ్యూట్‌లో ఓ ర్యాప్ సాంగ్‌ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇదే వివేక్ సాగ‌ర్‌, విశ్వ‌క్‌సేన్ ల మ‌ధ్య వివాదానికి దారితీస్తోంది.

ఈ ర్యాప్ సాంగ్‌కి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించాడు. అయితే ఈ పాట‌ని మ‌రోఓ సినిమా కోసం కంపోజ్ చేశాడంట వివేక్ సాగ‌ర్‌. అయితే అత‌ని మాట‌ని లెక్క చేయ‌కుండా దాన్ని ఎన్టీఆర్ బ‌ర్త్‌డే కోసం వాడ‌టం వివేక్‌ని హ‌ర్ట్ చేయ‌డంతో విశ్వ‌క్‌సేన్‌పై వివేక్ సాగ‌ర్ లీగ‌ల్‌గా యాక్ష‌న్ తీసుకోవాల‌నుకుంటున్నార‌ని ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై విశ్వ‌క్‌సేన్ స్పందిస్తేగానీ వివాదం స‌ద్దుమ‌నిగేలా క‌నిపించ‌డం లేదు.