మంచు విష్ణు ఆ డైరెక్టర్ ని బెదిరించాడట


మంచు విష్ణు ఆ డైరెక్టర్ ని బెదిరించాడట
మంచు విష్ణు ఓటర్ పోస్టర్

ఓటర్ అనే సినిమాతో కార్తీక్ రెడ్డి అనే యువ దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు . అయితే ఆ దర్శకుడు హీరో మంచు విష్ణు పై సంచలన ఆరోపణలు చేస్తున్నాడు . మంచు విష్ణు నన్ను బెదిరించి ఓటర్ కథ , అసెంబ్లీ రౌడీ కథ ఒకటే అని రాయించుకున్నాడని , అలాగే డాక్యుమెంట్ల పై బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు . ఓటర్ సినిమా కథ బాగుండటం అలాగే సినిమా కూడా బాగా రావడంతో కథ , స్క్రీన్ ప్లే పేర్లు నేనే వేసుకుంటాను అని ఒత్తిడి చేసాడని దాంతో స్క్రీన్ ప్లే రైటర్ గా మంచు విష్ణు పేరు వేయించానని అంటున్నాడు కార్తీక్ రెడ్డి .

ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఓటర్ చిత్రాన్ని తీశామని , రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో మంచు విష్ణు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరైంది కాదని , అసలు ఈ కథని రచయితల సంఘం లో నమోదు చేయించానని అలాగే పవర్ ఫుల్ అనే టైటిల్ ని పెట్టామని కానీ మంచు విష్ణు ఒత్తిడి మేరకు ఓటర్ గా మార్చామని , షూటింగ్ లో పలుమార్లు ఇబ్బందులు పెట్టాడని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు ఓటర్ దర్శకుడు కార్తీక్ రెడ్డి . మరి ఈ ఆరోపణలపై మంచు విష్ణు ఎలా స్పందిస్తాడో చూడాలి .