మంచు విష్ణు ఇలా చేయడం ఏంటి ?


మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం ” ఓటర్ ” . అయితే రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో ఓటర్ సినిమా నిర్మాత నాకు ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని ఎందుకంటే ఈ సినిమా అసెంబ్లీ రౌడీ ని పోలి ఉందని నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది . మంచు విష్ణు ఇలా చేయడంతో ఫిలిం నగర్ సర్కిల్లో రకరకాల వాదనలు వినబడుతున్నాయి .

అయితే ఆ వాదనలు ఎలా ఉన్నప్పటికీ ఒకటి మాత్రం అందరినీ షాక్ కి గురి చేస్తోంది . అసెంబ్లీ రౌడీ ని ఓటర్ స్క్రీన్ ప్లే పోలి ఉంటే ఆ సినిమా కు ఎలా ఒప్పుకున్నాడు ? ఎలా నటించాడు ? అన్నది . ఒక కథ అయినప్పుడు ఈ విషయాన్నీ అప్పుడే చెప్పాల్సి ఉండే కానీ అలా చేయకుండా సినిమా లో నటించి ఇప్పుడు రిలీజ్ సమయంలో ఒక కోటి యాభై లక్షలు నాకు చెల్లించాలి అని నోటీసు పంపడం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారు ఫిలిం నగర్ వాసులు .