విశ్వక్ సేన్ కొత్త సినిమా కబుర్లు


విశ్వక్ సేన్ కొత్త సినిమా కబుర్లు
విశ్వక్ సేన్ కొత్త సినిమా కబుర్లు

ఇన్స్పెక్టర్ విక్రమ్ రుద్రరాజు క్యారెక్టర్ లో మన చేత కనీసం వాష్ రూమ్ కి కూడా వెళ్లకుండా సినిమా అంతా చూపించిన మన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త సినిమా మొదలు పెట్టాడు. ఇప్పటికే హిట్ సినిమా సూపర్ హిట్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విశ్వక్ అదే ఊపులో మరో సినిమా కూడా కమిట్ అయ్యాడు. ఇక తన గత సినిమాలైన ఫలక్నామా దాస్ మరియు హిట్ సినిమాలు సక్సెస్ అవడంతో విశ్వక్ సేన్ మార్కెట్ బాగా పెరిగింది.

నరేష్ కొప్పల్లి అనే కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్నాడు విశ్వ భాయ్. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూజా మరియు అధికారిక అనౌన్స్మెంట్ రేపు జరగనున్నాయి. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ సర్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రాబోతోంది ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు ఎంపిక జరుగుతూ ఉండగా టెక్నికల్ టీం ను మాత్రం లాక్ చేశారు.

విశ్వక్ గత సినిమా అయిన “హిట్” కు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా అద్భుతమైన విజువల్స్ అందించిన మణికందన్ సార్ మరొకసారి ఈ సినిమాకు పని చేస్తూ ఉండగా, “గూఢచారి” వంటి సెన్సేషనల్ హిట్ సినిమాలతో పాటు ప్రస్తుతం వస్తున్న అనేక హిట్ సినిమాలకు ఎడిటింగ్ చేస్తున్నగ్యారీ సర్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాకు మ్యూజిక్ అందించిన రధాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. హీరోయిన్ గా కొత్త అమ్మాయికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.

Credit: Twitter