వెంకీతో సినిమా చేయనున్న సీనయ్య


వెంకీతో సినిమా చేయనున్న సీనయ్య
వెంకీతో సినిమా చేయనున్న సీనయ్య

మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వివి వినాయక్ దర్శకుడిగా పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. ఖైదీ నెం 150తో హిట్ కొట్టినా అది రీమేక్, ఆల్రెడీ విజయవంతమైన సబ్జెక్ట్. దానికి ముందు తీసిన అఖిల్, తర్వాత తీసిన ఇంటిలిజెంట్, వివి వినాయక్ స్థాయిని ప్రశ్నించేలా ఉన్నాయి. ఇంటిలిజెంట్ దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో వివి వినాయక్ తర్వాతి సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.

ముందు నందమూరి బాలకృష్ణతో రీమేక్ సినిమా ఒకటి ప్లాన్ చేసాడు. వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ రవితేజతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ను అనుకున్నాడు. అది కూడా కుదరలేదు. ఈలోపు వివి వినాయక్ కు హీరోగా అవకాశమొచ్చింది. ఇటీవలే ప్రారంభమైన సీనయ్య నవంబర్ నుండి షూటింగ్ కు వెళ్లనున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం మూడు నెలల డేట్స్ కేటాయించాడు వినాయక్.

మరోవైపు తన తర్వాతి సినిమా కోసం కథను సిద్ధం చేసుకుంటున్నాడు. సీనయ్య మూవీ లాంచ్ సందర్భంగా దర్శకుడిగా తన నెక్స్ట్ సినిమా వెంకటేష్ తో ఉంటుందని ప్రకటించాడు. సీనయ్యను పూర్తి చేసి వెంకీ సినిమాను మొదలుపెడతాడు వినాయక్. ఈలోపు వెంకీ కూడా తరుణ్ భాస్కర్ తో కమిటైన సినిమాను పూర్తి చేస్తాడు. త్వరలోనే వినాయక్, వెంకీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవ్వనుంది. నల్లమలపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.