బాలీవుడ్‌లో క‌ల‌క‌లం.. మ్యూజిక్‌డైరెక్ట‌ర్‌ మృతి!


బాలీవుడ్‌లో క‌ల‌క‌లం.. మ్యూజిక్‌డైరెక్ట‌ర్‌ మృతి!
బాలీవుడ్‌లో క‌ల‌క‌లం.. మ్యూజిక్‌డైరెక్ట‌ర్‌ మృతి!

క‌రోనా వైర‌స్ బాలీవుడ్‌ని వ‌ణికిస్తోంది. ముఖ్యంగా ముంబై మ‌హాన‌గ‌రాన్ని ఊపిరాడ‌నివ్వ‌కుండా చేస్తున్న వైర‌స్ మ‌హ‌మ్మారి  బాలీవుడ్ సినీ జ‌నాన్నిమాత్రం భ‌య భ్రాంతుల‌కు గురిచేస్తోంది. క‌ర‌ణ్ జోహార్ ఇంట్లో క‌రోనా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ‌టం, అదే త‌ర‌హాలో బోనీక‌పూర్ ఇంట్లో ప‌నిచేసే వారు కూడా క‌రోనాకు గురికావ‌డంతో ప్ర‌స్తుతం బాలీవుడ్ మొత్తం వ‌ణికిపోతోంది.

తాజాగా దీని కార‌ణంగా బాలీవుడ్ ఫేమ‌స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌లోని  సాజిద్ – వాజిద్ ల‌లో వాజిద్‌ఖాన్ (452) ఆదివారం క‌న్నుమూశారు. వాజిద్‌ఖాన్ గ‌త కొంత కాలంగా కిడ్ని, గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో వున్న అత‌నికి ఇటీవ‌లే క‌రోనా వ్యాధి సోకింది. ఇటీవ‌లే అత‌న్ని ముంబైలోని కోకిలాబెన్ హాస్పిట‌ల్‌లో చేర్చారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దీంతో బాలీవుడ్‌లో క‌ల‌క‌లం మొద‌లైంది. బాలీవుడ్‌లో టాప్ హిట్ చిత్రాల‌కు సాజిద్‌ఖాన్‌తో క‌లిసి వాజీద్‌ఖాన్ సంగీతం అందించారు. అలాంటి వ్య‌క్తి అర్థాంత‌రంగా చ‌నిపోవ‌డం బాలీవుడ్ వ‌ర్గాల‌ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. వాజీద్ మృతి ప‌ట్ల ప్రియాంకా చోప్రా, ప‌రిణీతి చోప్రా, వ‌రుణ్‌ధావ‌న్‌, సోనూ నిగ‌మ్ ట్విట్ట‌ర్ ద్వారా సంతాపం ప్ర‌క‌టించారు.