సెట్ లో గొడవ జరిగిందట


war between cameraman and writer in dil rau setహీరో రామ్ నటిస్తున్న ”హలో గురూ ప్రేమ కోసమే ” సెట్లో గొడవ జరిగినట్లు తెలుస్తోంది . నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు కాగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే రెండు మూడు రోజుల క్రితం షూటింగ్ జరుగుతున్న సందర్బంగా రచయిత ప్రసన్న కు సీనియర్ కెమెరామెన్ విజయ్ కి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం . కెమెరామెన్ కి దర్శకుడు సలహాలు సూచనలు ఇవ్వొచ్చు అయితే ప్రసన్న వచ్చి సీనియర్ కెమెరామెన్ అయిన విజయ్ కి అది అలా ఉండాలి ఇది ఇలా ఉండాలి అని చెబుతుంటే ఎక్కడో కాలిందట దాంతో సీరియస్ అయ్యాడట .

ఇంకేముంది వెంటనే దర్శకులు నక్కిన త్రినాథరావు జోక్యం చేసుకొని గొడవ ని సద్దుమణిగేలా చేసాడట . ఇంతకీ ప్రసన్న ఆయనకు చెప్పడం ఏంటంటే ……. నక్కిన త్రినాథరావు కు ప్రసన్న తల్లో నాలుకలా ఉంటాడు దాంతో అతడి వ్యవహారాలు సెట్లో ఇతడే చూసుకుంటాడట . అలా కెమెరామెన్ కు కూడా చెప్పడంతో ఇగో హర్ట్ అయ్యింది అదీ విషయం . ప్రస్తుతానికైతే గొడవ సద్దుమణగినట్లు సమాచారం . రామ్ ఈ సినిమా పై చాలా ఆశలే పెట్టుకున్నాడు మరి ” హలో గురూ ప్రేమ కోసమే ” ఈ జీవితం అంటూ .

English Title: war between cameraman and writer in dil raju set