భరత్ కంటే రంగస్థలంకే ఎక్కువ వసూళ్లు


war between ramcharan and mahesh babu fans

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20న విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది అలాగే భారీ వసూళ్ల ని సాధించింది నిన్ననే రెండు తెలుగు రాష్ట్రాలలో ఆరు కేంద్రాల్లో వంద రోజులను కూడా పూర్తిచేసుకుంది . అయితే ఈ సినిమా కంటే ముందుగా మార్చి 30న రాంచరణ్ నటించిన రంగస్థలం విడుదలై మొదటి రోజునే బ్లాక్ బస్టర్ రేంజ్ హిట్ అని పేరు తెచ్చుకుంది దాంతో కలెక్షన్ల సునామి మొదలయ్యింది కట్ చేస్తే 15 కేంద్రాల్లో దిగ్విజయంగా 100 రోజులను పూర్తి చేసుకోవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 214 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా చరిత్ర సృష్టించింది .

రంగస్థలం 214 కోట్లు సాధించగా మహేష్ భరత్ అనే నేను చిత్రం మాత్రం 205 కోట్లను మాత్రమే వసూల్ చేసింది దాంతో మహేష్ కంటే చరణ్ గ్రేట్ అంటూ మెగా ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు . చరణ్ రంగస్థలం కంటే భరత్ అనే నేను చిత్రం తక్కువ కేంద్రాల్లో వంద రోజులు అలాగే తక్కువ వసూళ్లు కావడంతో మహేష్ – చరణ్ ల మధ్య పోటీ పెడుతున్నారు కొంతమంది అత్యుత్సాహం ఉన్న అభిమానులు . మా హీరో గ్రేట్ అంటే మా హీరో గ్రేట్ అంటూ లెక్కలు చెబుతూ సవాల్ లు విసురుకుంటున్నారు . రంగస్థలం చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా భరత్ అనే నేను చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు .

English Title: war between ramcharan and mahesh babu fans