సంపూర్ణేష్ బాబు నుండి ఆ హీరోని కాపాడేదెవరు ?


sampoornesh babu
sampoornesh babu

హీరో రామ్ తో పోటీపడుతున్నారు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు . సంపూ రంగంలోకి దిగాడంటే రామ్ పరిస్థితి ఏంటి ? ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది . రామ్ కు సంపూర్ణేష్ బాబు కి పోటీ ఏంటి ? అన్నదే కదా ! ప్రశ్న . అసలు విషయం ఏంటంటే ….. ఈనెల 18 న రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం విడుదల అవుతుండగా , ఆ మరుసటి రోజున అంటే జూలై 19 న సంపూ నటించిన కొబ్బరిమట్ట చిత్రం విడుదల అవుతోంది .

అసలే సంపూ బర్నింగ్ స్టార్ దాంతో సరదాగా నవ్వుకోవడానికి ఇలా చర్చ చేస్తున్నారు . అయితే సంపూ ని తేలిగ్గా తీసుకోలేం ఎందుకంటే హృదయ కాలేయం అనే సినిమా టాలీవుడ్ ని షేక్ చేసింది మరి . అయిదేళ్ల తర్వాత హృదయ కాలేయం మేకర్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఇలా చర్చ సాగుతోంది . ఇక రామ్ విషయానికి వస్తే గతకొంత కాలంగా రామ్ కు హిట్ లేదు దానికి తోడు దర్శకులు పూరి జగన్నాధ్ కు కూడా సక్సెస్ లేదు మరి . ఈ రెండు చిత్రాల్లో విజయం సాధించేది ఎవరో ఈనెల 19 న తేలనుంది .