మా ఎన్నికల్లో మళ్ళీ పోరాటమే


ar between Shivajiraja and Naresh

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మల్లీ పోరాటం తప్పడం లేదు . గత ఎన్నికలు  సైలెంట్ గా ఎలాంటి హడావుడి లేకుండా అయిపోయాయి కానీ అంతకుముందు మాత్రం రాజేంద్రప్రసాద్ – జయసుధ పోటీ పడినప్పుడు మాత్రం రాజకీయ ఎన్నికలను తలపించింది మా ఎన్నికలు . కట్ చేస్తే ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ వచ్చినట్లే కనిపిస్తోంది ఎదుకంటే శివాజీరాజా అధ్యక్ష పదవికి  పోటీ పడుతుండగా సీనియర్ నటుడు నరేష్ కూడా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాడు .

 

శివాజీరాజా తన ప్యానల్ ని సిద్ధం చేయగా నరేష్ కూడా తన ప్యానల్ ని సిద్ధం చేసుకున్నాడు . ఇటీవల కాలం వరకు  శివాజీరాజా అధ్యక్షుడిగా పనిచేయగా నరేష్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు . అయితే లెక్కల్లో ఇద్దరి మధ్య తేడా లు రావడంతో శివాజీరాజా పై ఆరోపణలు చేస్తూ మీడియా కెక్కాడు నరేష్ . దాంతో ఇద్దరి మధ్య పొసగడం లేదు . ఇపుడు ఎన్నికలు కాబట్టి ఇక ఆరోపణలతో దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది .

English Title: War between Shivajiraja and Naresh