సప్తగిరి – తాప్సీ లలో విజయం సాధించేది ఎవరు ?


War between Taapsi and Saptagiri
War between Taapsi and Saptagiri

ఈరోజు 5 సినిమాలు విడుదల అవుతున్నాయి . విశ్వామిత్ర , వజ్రకవచధర గోవింద , గేమ్ ఓవర్ , ఏక్ , ఐ లవ్ యు . ఈ చిత్రాల్లో గేమ్ ఓవర్ , వజ్రకవచ ధర గోవింద చిత్రాలపై కాస్త ఆశలు ఉన్నాయి . ఎందుకంటే తాప్సీ గతకొంత కాలంగా విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ సాధిస్తోంది బాలీవుడ్ లో . తాజాగా తాప్సి నటించిన గేమ్ ఓవర్ తెలుగు , తమిళ , హిందీ భాషల్లో విడుదల అవుతోంది . డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేసిన ఈ సినిమాపై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉంది , అయితే ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో ఈరోజు తెలిసిపోనుంది .

ఇక కమెడియన్ సప్తగిరి విషయానికి వస్తే కామెడీ వేషాలు మానేసి హీరోగా నటిస్తున్నాడు . ఒక సినిమా హిట్ అయినప్పటికీ మరో సినిమా ప్లాప్ అయ్యింది . దాంతో కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసిన సినిమా ఈ వజ్రకవచ ధర గోవింద . ఎంటర్ టైన్ మెంట్ కు తోడు ఎమోషన్స్ క్యారీ అయ్యేలా ఈ సినిమా చేసాడట . ఇక ఈ సినిమా భవితవ్యం కూడా ఈరోజే తెలిసిపోనుంది .