విజయ్ చనిపోయాడంటూ పిచ్చికూతలు


vijay
vijay

తమిళ స్టార్ హీరో విజయ్ చనిపోయిన రోజు జూన్ 22 అంటూ యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు . తమిళనాట విజయ్ కి అలాగే అజిత్ ఫ్యాన్స్ కు పడదు అన్న విషయం తెలిసిందే . దాంతో ప్రతీసారి ఇద్దరి సినిమాలు ఏది వచ్చినా కూడా ఫ్యాన్స్ విపరీతంగా తిట్టుకోవడం జరుగుతోంది . ఇక ఇప్పుడు సోషల్ మీడియా ఉదృతం అయ్యింది కాబట్టి వార్ మరింతగా ముదిరింది

హారో విజయ్ పుట్టినరోజు ఈనెల 22 దాంతో విజయ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విజయ్ కి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు మరో రెండు రోజులు ఉండగానే . అదే అజిత్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది దాంతో విజయ్ పుట్టినరోజు కాదు అది అతడి చచ్చిన రోజు అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఇంకేముంది వెంటనే ట్రెండ్ అయిపొయింది దాంతో ఆవేశంతో ఊగిపోయిన విజయ్ ఫ్యాన్స్ అజిత్ ని తిట్టడం మొదలు పెట్టారు . అభిమానం ఉండాలి కానీ ఇలా హద్దులు దాటేసి తిట్టుకోవడం మాత్రం దారుణమే